Monday, December 23, 2024

నిత్య వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

వనపర్తి  : ప్రతి నిత్యం కనీస వ్యాయామం చేసి ఆయురారోగ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. జూన్ 21వ తేదిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తకోట ఆరోగ్య వాకింగ్ క్లబ్ సభ్యులు సుమారు 70 మంది కొత్తకోట నుంచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వనపర్తి వరకు 17 కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ రావడంతో పట్టణ శివారులో జిల్లా పరిషత్ చైర్మెన్ కె. లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్ తదితరులు అడ్డం వెళ్లి స్వాగతం పలికారు. శివారు నుంచి ఐడిఓసి వరకు మార్నింగ్ వాక్ చేస్తూ చేరుకున్నారు. అనంతరం యోగా కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టర్ సమక్షంలో ఆరోగ్య యోగా ఆసనాలు ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయాన్నే కాలి నడక అనంతరం కొంత వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఉదయాన్నే కాలి నడక, తగిన వ్యాయామం జీవితంలో భాగం కావాలని తెలిపారు. కొత్తకోట నుంచి వనపర్తి వరకు నడుచుకుంటూ వచ్చి యోగా గొప్పతనాన్ని ఈ రకంగా వివరిండం చాలా మంచి పరిణామమని, వనపర్తి పట్టణంలో సైతం యోగా వాకింగ్ క్లబ్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలను యోగా, వాకింగ్ వైపు ప్రొత్సహించాలని తెలిపారు.

ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని యోగా ద్వారా అందించిన భారతదేశ గొప్పతనాన్ని వక్తలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మెన్ వామన్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీధర్, డాక్టర్ మురళీధర్, సత్తార్, శంకర్ గౌడ్, మొదలైన వారితో పాటు అరోగ్య వాకింగ్ క్లబ్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, సభ్యులు రవి, రామకృష్ణ, బాలకృష్ణ,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News