Thursday, November 21, 2024

యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తోంది: మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం ఉదయం జలగం వెంగళ రావు పార్కులో హార్ట్ ఫుల్ నెస్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ సీ.ఎస్.ఆర్ కింద ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ ను జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… మనస్సు ప్రశాంతంగా రోజంతా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ యోగా, మెడిటేషన్‌ను తప్పనిసరిగా ఆచరించాలనిఅన్నారు.

మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయని. నగర జీవనవిధానంలో కాలంతో పోటీ పడుతూ, ఉరుకుల పరుగుల జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ప్రతి నిత్యం యోగాతో తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని మేయర్ అన్నారు.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళాల్లో నిర్వహించాలని తద్వారా ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. యోగా, మెడిటేషన్ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్లు పాల్గొన్నారు.

గ్రేటర్ హైద్రాబాద్ లో గ్రీనరి పెంపొందించేందుకు వివిధ వినూత్న పద్ధతిలో చర్యలు చేపట్టామని తద్వారా ప్రజలకు ఆహ్లాదకరంగా వాతావరణం కల్పించినట్లు మేయర్ ఈ సందర్భంగా వెల్లడించారు. హార్ట్ ఫుల్ నెస్ ఇన్‌స్టిట్యూట్ సంస ్థజలగం వెంగళ్ రావు పార్కును సి.ఎస్.ఆర్ కింద అభివృద్ధి చేయడంతో పాటు సుందరీకరణలో భాగంగా హెర్బల్, మెడిసిన్ గార్డెన్స్ మొక్కలు, భారతదేశానికి చెందిన బయో-డైవర్సిటీ మొక్కలు, పరాగసంపర్క ఉద్యానవనం, సుగంధ మొక్కలు పెంచడం లో జిహెచ్‌ఎంసి తో సమన్వయంతో ముందుకు సాగుతుందని మేయర్ తెలిపారు.

జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ మాట్లాడుతూ ఎనాన్స్ సెంటర్ వద్ద గల పార్కు అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యోగా సెంటర్ ప్రారంభించిన అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,కమిషనర్ రోనాల్డ్ రోస్, పలువురుతో కలిసి యోగా చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వెంకటేష్ దొంత్రే, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ వెంట చీప్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వాకిల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News