Saturday, November 23, 2024

ఈవిఎంల పనీతీరు పరిశీలన

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను అత్యంత ప్రతిష్ట, భద్రత మధ్య సోమవారం నుంచి నాగర్‌కర్నూల్ ఈవిఎం గోదాంలో నిర్వహిస్తున్న ఈవిఎంల పనితీరు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పరిశీలించారు. ఈసిఎల్‌ఈ కంపెనీ ఇంజనీరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 4 వేల 325 ఎలక్ట్రానిక్ యంత్రాల పనితీరును పది రోజుల పాటు పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అత్యంత పకడ్బందీ బందోబస్తు మధ్య ఈవిఎంల మొదటి స్థాయి పనితీరును పరిశీలించనున్నట్లు తెలిపారు.

ఈవిఎం, వివి ప్యాడ్, బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ మిషన్లు పనితీరు పరిశీలించనున్నారు. జిల్లాకు అలాటైన కంట్రోల్ యూనిట్లు 1707, బ్యాలెట్ యూనిట్లు 1330, వివి ప్యాడ్లు 1298, ఎలక్ట్రానిక్ యంత్రాలు మొదటి స్థాయి పరిశీలన అనంతరం 1500 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను సిద్ధం చేసి ఈవిఎం గోదాంలో భద్రపరుచనున్నట్లు తెలిపారు. ఈవిఎంల గోదాంలోకి ఇతరులు ప్రవేశించకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. తనిఖీల్లో భాగంగా మాక్ పోలింగ్ నిర్వహించిన స్లిప్పులను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొదటి స్థాయి తనిఖీలను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. సమర్థవంతమైన ఈవిఎం యంత్రాలను మాత్రమే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఐసిఐఎల్ ఇంజనీరింగ్ అధికారులతో యంత్రాల పనితీరు పరిశీలించి వివరాలను సేకరించారు. ఈవిఎంల భద్రతను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించే వీటిని మొదటి స్థాయి తనిఖీలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ను సైతం భద్రతా సిబ్బంది తనిఖీ చేసి లోపలికి అనుమతిచ్చారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ జాకీర్ అలీ, ఈసిఎల్‌ఈ ఇంజనీరింగ్ అధికారి శ్రీ నివాస రెడ్డి, ఈడిఎం నరేష్, కలెక్టర్ పిఎస్ ఖాజా, ఎలక్షన్స్ సిబ్బంది కరుణాకర్, సిసి గౌతమ్, కాంగ్రెస్, బిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌పి తెలంగాణ, సిపిఎం పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News