Thursday, January 23, 2025

ఎఎస్‌ఆర్టీయూ ఈడి సూర్యకిరణ్‌కు డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.సూర్యకిరణ్‌కు డాక్టరేట్ లభించింది. ‘మార్కెట్ ధోరణి- టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల పనితీరు’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) డాక్టరేట్‌ను బుధవారం అందించింది. నిట్ మేనేజ్‌మెంట్ విభాగ అసోసియేట్ ఫ్రొఫెసర్ ప్రాన్సిస్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ పరిశోధనను సూర్యకిరణ్ పూర్తి చేశారు. 1992లో ఆర్టీసిలో చేరిన సూర్యకిరణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డిఎం, డివిఎం, ఆర్‌ఎం, తదితర హోదాల్లో పనిచేశారు. టిఎస్ ఆర్టీసి చీఫ్ పర్సనల్ మేనేజర్ (సినిఎం)గా విధులు నిర్వర్తించారు.

Also Read: దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం: ఎంఎల్ సి కవిత

ప్రస్తుతం డిప్యూటేషన్‌పై న్యూఢిల్లీలోని ఏఎస్‌ఆర్టీయూ ఈడీతో పాటు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (సిఐఆర్టీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిట్ తనకు డాక్టరేట్‌ను అందించడంతో హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టిఎస్‌ఆర్టీసి ఎండి సజ్జనార్‌ను గురువారం సూర్యకిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టరేట్ ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్‌ను ఎండి సజ్జనార్ అభినందించారు. టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల పనితీరుపై పరిశోధన చేయడం ప్రశంసనీయమని ఎండి తెలిపారు. వరంగల్ నిట్‌తో టిఎస్ ఆర్టీసి చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా సంస్థ అధికారులకు పిహెచ్‌డిలో ప్రవేశాలు కల్పిస్తున్నారని సజ్జనార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News