న్యూఢిల్లీ : సిక్కిం సరిహద్దులో చైనా సైన్యం అత్యుత్సాహం నేపథ్యంలో కేంద్రం ఆ దేశ యాప్‌లపై తాజాగా మరో కొరడా ఝళిపించినట్లు సమాచారం. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం విధించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది జూన్‌లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధింంచింది. ఇప్పుడు వాటిని శాశ్వత నిషేధం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారతీయ వినియోగదారుల డేటాను అక్రమంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయా సంస్థల వివరణను కోరింది కేంద్రం. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత వారమే నోటీసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం 59 యాప్‌లను శాశ్వతంగా నిషేధించానలి నిర్ణయించింది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 208 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే.
Permanent ban on Chinese apps including TikTok?