మన తెలంగాణ/సిటీ బ్యూరో: సమగ్ర నాలా అభివృద్ది కార్యక్రమం ద్వారా దశాబ్దాల కాలంగా నాలాల పరిసర ప్రాంతాల వాసులు ఎదుర్కొంటున్న ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎస్ ఎన్‌డిపి కింద చేపట్టిన నాలాల అభివృద్ది పనులపై మాసబ్ ట్యాంక్‌లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాంబర్‌లో గ్రేటర్ ప్రజా ప్రతినిధు, ఉన్నతాధికారుల సమిక్ష సమావేశం జరిగింది. మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఎస్‌ఎన్‌డిపి ఇఎన్‌సి జియాఉద్దీన్, సిఈ కిషన్, వసంత, ఎస్‌ఈలు రత్నాకర్, అనిల్ రాజ్, భాస్కర్‌రెడ్డి, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, రవికిరణ్, వాటర్ వర్క్ డిఒపిలు కృష్ణ, స్వామి, సిజిఎంలు ప్రభు, ఎలక్ట్రికల్ డిఈ సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎసిపి జ్ఞానేందర్‌రెడ్డిలు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పలు ప్రాంతా వాసులు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారన్నారు.
ఇందుకు నాలాల అక్రమణకు గురికావడం, నాలాల వెడల్పు తగ్గిపోవడంలాంటి కారణాలతో వరద నీరు సాఫీగా వెళ్లుందుకు అవకాశం లేక ముంపు సమస్య తలెత్తుతోందన్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పురపాలక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకచోరవతో ఎస్‌ఎన్‌డిపి విభాగాన్ని ఏర్పాటు చేసి నాలాల అభివృద్దికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి దశ కింద రూ.945 కోట్ల కేటాయించారని వెల్లడించారు. ఈ నిధులతో గ్రేటర్‌తో చుట్టు పక్కన ఉన్న మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభం అయ్యాయని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి అధికారులు ఫవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. నాలాల అభివృద్ది పనులు చేపట్టే క్రమంలో ఏలాంటి ఇబ్బందులున్నా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కారించేందుకు వెంటనే వారు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
నాలా అభివృద్ది పనులు వ్యయం
పద్మ కాలనీ నుంచి శివానంద్ నగర్ వరకు 902 మీటర్ల నాల విస్తరణ రూ.39 కోట్లు
నియోజవర్గం నల్లపోచమ్మ ఆలయం హెరిటేజ్ షాప్ వద్ద బ్రిడ్జి విసర్తణ రూ.12 కోట్లు
నాలా అభివృద్ది రూ.45 కోట్లు
కరాచీ బేకర్ వద్ద పికెట్ నాలాపై వంతెన నిర్మాణం రూ.10 కోట్లు
రోడ్‌లోని పికెట్ నాలా వంతెన రీ మోడలింగ్ రూ.20కోట్లు
చెరువు, కాప్రా చెరువు కలుపుతూ స్ట్రాం వాటర్ లైన్ రూ.41 కోట్లు
పోలీసులైన్ మీదగా ఇంటిగ్రేటెడ్ న్యూ డ్రైయిన్ రూ.22 కోట్లు
నుంచి లంగర్‌హౌజ్ వరకు 2752 మీటర్ల నాలా అభివృద్ది కల్వర్ట్ నిర్మాణం రూ.31.92కోట్లు
కాలనీ నుంచి షా హతీం వరకు నాలా అభివృద్ది రూ.31.92కోట్లు
ఎర్రగడ్డ నాలా అభివృద్ది పనులు రూ.12.86 కోట్లు
ఏ అబూబాకర్ నుంచి షా హతీం వరకు నాలా అభివృద్ది, పునరుద్దరణ పనులు రూ.31.92 కోట్లు
నాలా పునరుద్దరణ పనులు రూ.56.34 కోట్లు
సాగర్ నాలా అభివృద్ది పనులు రూ.12 కోట్లు