Monday, December 23, 2024

ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం : కెపి వివేకానంద్

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్‌లో రూ.90 లక్షలతో నూతనంగా చేపడుతున్న బాక్స్ నాలా నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గిరినగర్‌లోని ముంపు ప్రాంతాలకు వరదనీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కా రం చూపేందుకు బాక్స్ నాలా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజల ఇబ్బందులను స్వయంగా చూసి అందుకు పరిష్కారంగా నాలానిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రగతియాత్ర పర్యటనలో సైతం ప్రజలు ఈ సమస్యను తన దృష్టికి రావడం జరిగిందని, సమస్యపై ప్రత్యేక చొరవ చూపి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో గడిచిన ఏళ్లలో నియోజకవర్గంలో కోట్ల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జయరాం, డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకరయ్య, సీనియర్ నాయకులు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News