Thursday, January 23, 2025

మధుబన్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా : ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : దశల వారిగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. సోమవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని మధుబన్ కాలనీలో ఆయన స్థానిక బిఆర్‌ఎస్ నాయకులతో కలసి పర్యటించారు. ఈ సంద్భంగా స్థానికులు డ్రైనేజీ, రహదారుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్వయంగా ఆయా సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మధుబన్‌లో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కావలసిన స్థల పరిశీలించారు.

కాలనీలో పార్కు అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు మంజూరు అయ్యయాని , వెంటనే ఆ పనులు ప్రారంభించాలని జిహెచ్‌ఎంసి అధికారులకు చెప్పారు. అనంతరం ఎంపిపి పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్నం బోజనం పరిశీలించారు. విద్యార్థులు భోజనం ఏలా ఉంటుంది..? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగి తరగతి గదులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టి తీసుకువెళ్లారు. దాంతో స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయింయి , పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

అలాగే ఆ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ జగన్. ఈఈ నరేందర్‌గౌడ్, వాటర్ బోర్డు జిఎం జమీల్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు టి.ప్రేమ్‌గౌడ్ , మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ, యూత్ అధ్యక్షుడు రఘు యాదవ్, సీనియర్ నాయకుడు సరికొండ వెంకటేష్, నాయకులు జీవన్‌గౌడ్, ఎల్లప్ప, ,అర్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News