Monday, January 20, 2025

మురుగు కష్టాలకు శాశ్వత పరిష్కారం : ముఠాగోపాల్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: మురుగునీటి ఇక్కట్లను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు. సోమవారం వి ద్యానగర్ గౌసియా మసీదు వద్ద 15లక్షల రూపాయలతో చేపట్టనున్న సివరేజి పైప్ లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు.

ఇందుకోసం పెద్దమొత్తంలో నిధులు కేటాయించి దీర్ఘకాలిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముఠా జైసింహ, బి.మనోహర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి సురేందర్, ఎండి ఖలీల్, ఖదీర్, అబ్బు, ధర్మలతో పాటు బి ఆర్ ఎస్ కార్యకర్తలు, బస్తీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్డు కార్యాలయంలో పూజలు
పారదర్శకమైన పాలనతో స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించడానికే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు. అడి క్ మెట్ కమ్యూనిటిహలులో ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే సందర్శించారు.

కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అడిక్ మెట్ బస్తీ వాసులు ముఠా గోపాల్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతు స్థానికుల వినతుల మేరకే కమ్యూనిటిహలులో వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ప్రకాష్, తిరుమల్, రాజు తదితరుల బస్తీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News