Saturday, November 23, 2024

జూబ్లీహిల్స్ , కేబిఆర్ పార్క్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, కేబిఆర్ పార్కు, రోడ్ నెం. 92 పరిసరాల్లో మురుగునీటి సమస్యకు జలమండలి శాశ్వత పరిష్కారం చూపనుంది. ఈప్రాంతాల్లో సీవరేజీ ఓవర్ ప్లోతో ఇబ్బందులు తలెత్తున్నాయని తరుచూ పిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిషోర్ గురువారం సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీవరేజీ పైపులైన్ పనుల కోసం రూ. 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియలో ఈప్రాంతానికి సంబంధించి కొన్ని లీగల్ వివాదాలు ఉండటంతో పనులు ఆలస్యమైన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అవన్నీ తొలగాయని, తాజాగా టెండర్లు ఆహ్వానించినట్లు చెప్పారు. ఈప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి పనులు మొదలు పెడుతామని వివరించారు. మరోవైపు సమస్య పరిష్కారానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ నేపథ్యం..
జుబ్లీహిల్స్,  దాని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగును తరలించడానికి అప్పటి జుబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 40 ఏళ్ల క్రితం 300 ఎంఎం డయా పైపు లైన్ నిర్మాణం చేపట్టారు. దీన్ని జర్నలిస్టు కాలనీ నుంచి కట్ట మైసమ్మ (సీవీఆర్ కార్యాలయం) మీదుగా తాజ్ మహల్ హోటల్ దిగువ కట్ట మైసమ్మ దిగువనున్న పైపు లైన్ కు అనుసంధానించారు. తాజ్ మహల్ హోటల్ దగ్గర సెప్టిక్ ట్యాంకును నిర్మించి ఎగువ నుంచి వచ్చే మురుగును అక్కడ నిల్వ చేసి ఘన వ్యర్థాలను వేరు పరచి మిగిలిన మురుగును దిగువకు వదిలేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ పైపు లైన్ నిర్వహణ బాధ్యతను 1988 లో జలమండలికి అప్పగించారు. తర్వాతి కాలంలో జుబ్లీహిల్స్ తో పాటు జర్నలిస్టు కాలనీ, ప్రశాసన్నగర్, రోడ్ నం. 92 ప్రాంతాల్లో నివాసాలు పెరిగాయి. దీంతో మురుగు ఉత్పన్నం పెరగిపోయి పైపు లైన్ ఒత్తిడి తట్టుకోలేక ఓవర్ ప్లో అయి,  అప్పుడప్పుడు కేబీఆర్ పార్కులోకి ముగురు చేరుతుంది. ఇక్కడి నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా సీవర్ జెట్టింగ్ యంత్రాలతో శుభ్రపరుస్తున్నారు.

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి జర్నలిస్టు కాలనీ నుంచి తాజ్ మహల్ హోటల్ ను కలుపుతూ దాదాపు 2 కిలో మీటర్ల మేర నూతన సీవరేజీ పైపు లైన్ నిర్మాణం రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం కొన్నేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ సమయంలో కొన్ని లీగల్ సమస్యలు రావడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఇటీవలే ఆ సమస్యలు అన్నీ తొలగడంతో పనుల కాంట్రాక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుంది. తర్వాత పైపు లైన్ నిర్మాణం పనులు మొదలుపెడతారు.

అయితే ఈ పనులు చేపట్టే ప్రాంతంలో జుబ్లీహిల్స్ ప్రధాన రహదారి నం. 92 అధిక శాతం రాళ్లతో కూడిన ప్రాంతం కావడం, పైపు లైన్ కోసం దాదాపు 15 ఫీట్ల లోతు తవ్వాల్సిన అవసరం ఉండటంతో పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఒకవైపు రెండు కిలోమీటర్ల పైపులైన్ పనులు చేపడుతూనే అదే సమయంలో తాత్కాలికంగా మురుగు మళ్లింపు ప్రక్రియ జరుపుతారు. దీనికోసం జర్నలిస్టు కాలనీ నుంచి కట్టమైసమ్మ వరకు ఉన్న పురాతన సీవరేజీ పైపులైన్, మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, పాకిక్షంగా కూడుకుపోయినా, ధ్వంసమైన ప్రాంతాల్లో అవసరమైన మరమ్మత్తులు చేస్తారు. రోజు ఉత్పన్నమయ్యే మురుగును పురాతన పైపులైన్‌కు అనుసంధానమై ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రపరిచి అక్కడ పంపింగ్ ఏర్పాట్లు చేసి అక్కడకి చేరిన మురుగును 600 ఎంఎం డయా పైపులైన్ ద్వారా మళ్లిస్తారు. దీంతో ఆసమస్యకు తాత్కాలిక పరిష్కారంతో పాటు ప్రాంత వాసులకూ ఉపశమనం లభిస్తుంది.

రెండు ప్యాకేజీల్లో పనులు: ఈపైపులైన్ పనుల్ని రెండు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేపడుతారు. మొదటి జర్నలిస్టు కాలనీ నుంచి తాజ్‌మహల్ హోటల్ వరకు 850 మీటర్ల పొడవు, 450 ఎంఎం డయా పైపులైన్, రెండోది తాజ్ మహల్ హోటల్ నుంచి కట్టమైసమ్మ వరకు 1.15 కిమీ పొడవుతో 600 ఎంఎం డయా పైపులైన్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తారు. దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News