Monday, January 20, 2025

రెండో విడుత దళిత బంధుకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల

హైదరాబాద్ : దళిత బంధు రెండో విడుతకు ప్రభుత్వ అనుమతించింది. ఈ మేరకు ప్రభుతంం శనివారం జీఓ విడుదల చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున దళిత బంధు ఇవ్వనున్నారు. 118 నియోజకవర్గాల్లో 1,29,800 మందికి పథకం వర్తింపచేయనున్నారు. నిబంధల ప్రకారం లబ్ధి దారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి : కొప్పుల ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పధకం రెండో విడతకు సంబందించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విధంగా ప్రతీ నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు పధకం అమలు చేయనున్నారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ లు పధకం లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలనీ మంత్రి ఆదేశించారు. దళితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆయనన్నారు. ఇప్పటికే తొలి విడతలో దళిత బంధు పధకం ద్వారా లబ్ది పొందిన పలువురు ఉన్నత మైన జీవనం సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రానున్న ఎనిమిదేళ్ల లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పధకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు తిప్పి కొడుతున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వంపై. ముఖ్యమంత్రి కెసిఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం మంచిది కాదని కొప్పుల అన్నారు.
నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News