Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ సభకు అనుమతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్గొండ రూరల్ : ఈనెల 13వ తేదీన నల్లగొండలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు అనుమతి కోరుతూ బుధవారం జిల్లా ఎస్‌పి చందన దీప్తిని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, నల్లగొండ మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సభకు ఎస్‌పి అనుమతించారు. ఈ కార్యక్రమంలో సభ సమన్వయకర్త రవీంద్ర సింగ్, నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ మున్సిపల్ చైర్మన్, మందడి సైదిరెడ్డి రెడ్డి, మాజీ ఆర్‌వో మాలే శరణ్య రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, మెరుగు గోపి, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇదిలాఉండగా మాజీమంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, పలువురు నేతలతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో పెద్దపెద్ద రాకాసులతో కొట్లాడినం.. ఈ చిన్నచిన్న రేవంత్, కోమటిరెడ్డి తమకు లెక్కకాదు.. పోలీస్‌యాక్ట్‌లు, నిర్బంధాలు సంకెళ్ళు కొత్తకాదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News