Sunday, January 19, 2025

మున్సిపాలిటీల్లో అనుమతి, గ్రామాల్లో అనుమతి లేదు ?

- Advertisement -
- Advertisement -

ఇళ్ల నిర్మాణంపై అధికారుల ద్వంద వైఖరి
ఎల్‌ఆర్‌ఎస్ కట్టని ప్లాట్లలో నిర్మాణాలకు
అనుమతి ఇవ్వని పంచాయతీ కార్యదర్శులు
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై 33 శాతం కాంపౌండ్ చెల్లిస్తే
మున్సిపాలిటీల్లో నిర్మాణాలను అనుమతి

Raw materials prices have risen in home construction sector
మనతెలంగాణ/హైదరాబాద్:  ఎల్‌ఆర్‌ఎస్ కట్టని ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఈ విధానం గ్రామాల్లో ఒక మాదిరిగా, మున్సిపాలిటీల్లో మరో రీతిన అమలు జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా 90 వేల మంది యజమానులు దరఖాస్తు చేసుకోగా అందులో 48 వేల దరఖాస్తులకు మాత్రమే అనుమతి లభించింది. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించిన అంశం కోర్టులో పెండింగ్ ఉండడంతో అధికారులు ఆయా ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది.
రాష్ట్రంలోని 6,291 గ్రామాల నుంచి 10.89 లక్షల దరఖాస్తులు

అయితే మున్సిపాలిటీల్లో మాత్రం ఎల్‌ఆర్‌ఎస్ కట్టకున్నా ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి ఇస్తుండగా, గ్రామాల్లో మాత్రం పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలోని 6,291 గ్రామాల నుంచి 10.89 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌పై కోర్టులో కేసు ఉండడంతో వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో ఆయా ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే 2020, డిసెంబర్ 30న పురపాలక శాఖ ఒక మెమోను జారీ చేసింది. నిర్ణయించిన ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై 33 శాతం కాంపౌండ్ ఫీజు చెల్లించి (2020 ఆగష్టు 26వ తేదీకి ముందు లే ఔట్‌లోని రిజిస్ట్రర్ అయిన స్థలాల్లో) ఇంటి నిర్మాణ అనుమతి పొందవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలు పట్టణాలు, నగరాలకే పరిమితం కావడంతో గ్రామాలు, మండలాల్లో అనుమతులు రావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News