Thursday, January 23, 2025

తుక్కుగూడ కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసే స్థలం దేవాదాయ శాఖది

- Advertisement -
- Advertisement -
అనుమతిని నిరాకరించిన ప్రభుత్వం
మరో స్థలం కోసం కాంగ్రెస్ అన్వేషణ

మనతెలంగాణ/హైదరాబాద్: తుక్కుగూడలో ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ విజయ భేరి సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయాలనుకున్న స్థలం గుడికి సంబంధించిందని, ఆ స్థలంలో ఎలాంటి రాజకీయ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తెలిపింది.

కాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలోని వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఖాళీ స్థలం కోసం డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి దేవాదాయ శాఖకు పర్మిషన్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఎండోమెంట్ చట్టాల ప్రకారం గుడి ప్రదేశాల్లో రాజకీయ సభల ఏర్పాటుకు అనుమతి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సభకు పర్మిషన్ ఇవ్వలేమని దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. దేవాదాయ శాఖ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిన కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఎక్కడ నిర్వహిస్తోందో వేచి చూడాల్సిందేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News