Monday, December 23, 2024

పాలేరు, మహబూబాబాద్‌లో జెఎన్‌టియు కాలేజీల ఏర్పాటుకు అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌లో జెఎన్‌టియు కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బి.టెక్‌లో ఐదు కోర్సులతో జెఎన్‌టియు కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్‌ఇ, డేటా సైన్స్, ఇసిఇ, ఇఇఇ, మెకానికల్ కోర్సులతో కొత్త కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున కేటాయించారు. ఈ కొత్త కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. త్వరలో ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా, ఆ కౌన్సిలింగ్‌లో ఈ కాలేజీలోని సీట్లను భర్తీ చేస్తారు. ఈ విద్యాసంవత్సరంలో చేరిన వారు.. 2026 -27లో బీటెక్‌ను పూర్తిచేసి, పట్టాను పొందుతారు.కొత్తగా జెఎన్‌టియు కాలేజీలు మంజూరు కావడంతో పాలేరు, మహబూబాబాద్ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక విడతలో 19,049 సీట్లు
ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రత్యేక విడతలో మొత్తం 19,049 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్‌లో 479 సీట్లు అందుబాటులో ఉండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 202 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో 3,034 సీట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 2,721 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 2,630 సీట్లు, సివిల్ ఇంజనీరింగ్‌లో 2,505 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2,542 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News