ఆసిఫాబాద్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుండి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా ప్రోత్సాహక కమిటి సమావేశానికి హాజరై మాట్లాడారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్దేశించిన ఆరుణ లక్ష్యాలను సాధించేందుకు ఆధికారులు సమన్వయంతో కృషి చేయాలని, జిల్లాలో పరిశ్రమలకు వివిధ శాఖల ద్వారా మంజూరు చేయవలసిన అనుమతులు నిర్దేశిత గడువులోగా జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
టీ ఫ్రైడ్ ద్వారా టిఎస్‌పి విభాగంలో 4 లక్షల 8 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, సాయి వినూత్న పరిశ్రమకు 350 టన్నుల బోగ్గు కొరకు దరఖాస్తును సంబంధిత కమీషనర్ కార్యాలయానికి పంపించేందుకు అంగీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ రఘు, సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.