హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందనగానే ఎపి మంత్రులు మాట్లాడారని మంత్రి పేర్ని నాని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఎపి మంత్రులపై బురద జల్లుతున్నారన్నారు. పవన్‌కు బిఆర్‌ఎస్‌పై ఈ కొత్త ప్రేమ ఏంటో అర్థం కాలేదన్నారు. హరీష్ రావు ఏమన్నారో పవన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌తో పవన్‌కు కొత్తబంధం ఏర్పడిందా? అని అడిగారు.
Also Read: ఇంట్లోనే ఉరేసుకున్న ఎస్‌ఐ
తల్లివంటి ఎపిని అవమానిస్తే పవన్‌కు బాధలేదా?, ఈ రాష్ట్రం తన సొంత గడ్డ అన్న భావన పవన్‌కు లేదా?, అసత్యలను తమపై రుద్ది పవన్ రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్నారని పేర్ని విమర్శించారు. వివేకా హత్య కేసు విచారణ అనుమానాలకు తావిస్తోందని, విచారణ అధికారిని తప్పించమని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు. తరువాత వచ్చిన అధికారి కూడా అదే దారిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారని పేర్ని దుయ్యబట్టారు. రాజకీయ కోణంలో సిబిఐ విచారణ చేస్తున్నట్టు కనిపిస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.