అమరావతి: ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే ఉంటామని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కూటమి తప్పుల్ని ఎండగడుతూనే ఉంటామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తెలియజేశారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా వ్యవస్థలను వేధింపులకు వాడుకుంటున్నారని మండి పడ్డారు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు సొమ్ము జమ చేశామని చెప్పారు. తన భార్యపై తప్పుడు సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని చూశారని, ఆ సెక్షన్లు వర్తించవని జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్ప ఇప్పటివరకు ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదని, ‘స్వయంగా పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదని అన్నారు. సీజ్ ద గోడౌన్ అన్నా ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదని, వారిపై పెట్టింది కేవలం సిక్స్ఎ కేసు మాత్రమేనని పేర్నినాని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ సిపి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: పేర్ని నాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -