Wednesday, January 22, 2025

కొల్లు నటన ముందు ఎవరూ సరిపోరు: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: హైదరాబాద్ నడిబొడ్డున టిడిపి ఆఫీస్ ప్రభుత్వ స్థలం కాదా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. టిడిపి నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టిడిపి ఆఫీస్ స్థలం ప్రభుత్వ భూమి కాదా? అని అడిగారు. మచిలీపట్నంలో టిడిపి ఆఫీస్‌కు ప్రభుత్వ భూమి లీజుకు అడిగింది కొల్లు రవీందర్ కాదా? అని నిలదీశారు. పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ స్థలం ఇవ్వొచ్చని జివొ తెచ్చింది మీరు కాదా? అని నాని దుమ్మెతిపోశారు. ప్రభుత్వ ఆస్తులపై కన్నేసింది ఎవరు అని అడిగారు.

కొల్లు రవీంద్ర బందర్ కమల్‌హాసన్ అని, కొల్లు రవీంద్ర నటన ముందు ఎవరూ సరిపోరన్నారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై కొల్లు రవీంద్ర దాడి చేశారని నాని మండిపడ్డారు. సానుభూతి రాజకీయాల కోసమే కొల్లు రవీంద్ర ప్రయత్నం చేస్తున్నారని, దాడులు చేసి కేసులు పెట్టించుకొని బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటారా? అని నాని ప్రశ్నించారు. పదవి ఉన్నప్పుడు మాత్రం పని చేయరని, పదవి పోగానే ఇలాంటి డ్రామాలు ఆడుతాడని దుయ్యబట్టారు. అసత్యాలు, మోసాలు, డ్రామాలాడే జన్మ కొల్లుకు అవసరమా? అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News