Sunday, December 22, 2024

చంద్రబాబుది విజన్ కాదు పబ్లిసిటీ: నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు కాలజ్ఞానం చెప్పడం మొదలు పెట్టారని, విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన ఘనుడు బాబు అని ధ్వజమెత్తారు. బుధవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గతంలో విజన్ 2020 అన్నారని, ఇప్పుడు 2047 అనే విజన్ దిక్కుమాలినదని దుయ్యబట్టారు. బాబు 2020 విజన్ ఏమైందని, ఆటకెక్కిందా? అని పేర్ని ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా కట్టలేకపోయిందని, కనీసం కుప్పం నియోజకవర్గానికైనా నీళ్లిచ్చారా? అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్కూళ్లకు తాళం వేయడమే చంద్రబాబు విజన్ అని పేర్ని దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదల నుంచి డబ్బు వసూలు చేయడం కూడా బాబు విజన్ అని మండిపడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేసిన విజన్ చంద్రబాబుది కాదా? అని చురకలంటించారు. విజన్ పబ్లిసిటీ తప్ప బాబుకు విజన్ ఉందా? అని దుయ్యబట్టారు. ఆవగింజంత కూడా సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

Also Read: జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా హెడ్ మాస్టర్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News