Thursday, December 5, 2024

రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే పవన్‌కే ఇవ్వాలి: పేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తోంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ కదా? అని ఎంఎల్ఎ, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మంగళవారం పేర్ని మీడియాతో మాట్లాడారు. నెలలో రెండు రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వస్తాడని, ఏవేవో మాట్లాడి విమానమెక్కి హైదరాబాద్‌కు వెళ్లిపోతాడని విమర్శించారు. రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే ప్రతి సంవత్సరం పవన్‌కే ఇవ్వాలని చురకలంటించారు. పవన్‌కు కనీనం కులాలపై అవగాహనే లేదని పేర్ని నాని మండిపడ్డారు. ఏ సిద్ధాంతాన్ని చూసి పవన్‌ను ప్రజలు నమ్మాలని అడిగారు. సిద్ధాంతాలు లేని వ్యక్తి ఎవరంటే పవన్ కల్యాణ్ అని, పవన్ ఉపన్యాసాలన్నీ సినిమా డైలాగ్‌లే తప్ప కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. ఓ లక్ష్యం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News