Wednesday, January 22, 2025

పవన్ ఒక చెప్పు చూపిస్తే… నేను రెండు చెప్పులు చూపిస్తా: నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: అది వారాహి కాదని, నారాహి అని వైసిపి నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వారాహి యాత్రలో జనసేన అధినే పవన్ కల్యాణ్ కౌంటర్‌కు నాని రీకౌంటర్ ఇచ్చారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రోజుకొక డైలాగ్ చెప్పి అది వ్యూహం అంటాడని, పవన్ ఒక్కడికే చెప్పులు ఉన్నాయా? తమకు ఉన్నాయని రెండు చెప్పులు నాని చూపించాడు.

Also Read: వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానన్నారు. జనసేనను చంద్రబాబు నడిపిస్తున్నారని, ఆంధ్రాలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని చురకలంటించారు. పదేళ్ల నుంచి పవన్ పార్టీని చంద్రబాబు నడుపుతున్నారని నాని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో గులాబీ జెండాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎపిని తిడుతుంటే పవన్ ఎందుకు మాట్లాడుతాలేరని అడిగారు. ఎఏ పవన్ సినిమాను తాము ఆపలేదన్నారు. ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీటు వస్తుందని, చంద్రబాబు వ్యూహాలను నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగుపెట్టలేవన్నారు. చంద్రబాబు కోసం ఇంత దిగజారడం అవసరమా? అని నాని అడిగారు. పవన్ అంటే చేగువేరా కాదు చంద్రబాబు అని, చేగువేరాది రాజీలేని పోరాటం అని, పవన్ లాలూచీ రాజకీయమని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News