Monday, December 23, 2024

‘ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ ప్రారంభించిన పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా

- Advertisement -
- Advertisement -

ముంబై: వైన్‌, స్పిరిట్స్‌ పరిశ్రమలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా (పీఆర్‌ఐ), పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ‘# ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ కార్యక్రమం ప్రారంభించింది. తమ ప్యాకే జింగ్‌ నుంచి శాశ్వతంగా మోనో కార్టన్స్‌ను తొలగించాలనే ప్రయత్నానికి ఇది కొనసాగింపు.ఈ ల్యాండ్‌మార్క్‌ సస్టెయినబిలిటీ కార్యక్రమంతో, ఈ కంపెనీ 100% శాశ్వతంగా మోనో కార్టన్స్‌ను తమ ప్యాకేజింగ్‌ నుంచి జూన్‌ 2023 నాటికి దశల వారీగా తొలగించడం లక్ష్యంగా చేసుకుంది.

‘# ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ కార్యక్రమం, గింజ నుంచి గ్లాస్‌ వరకూ తమ వాల్యూచైన్‌ వ్యాప్తంగా ప్రతి దశలోనూ ప్యాకేజింగ్‌ వ్యాప్తంగా పర్యావరణ ప్రభావం గణనీయంగా తగ్గించాలనే కంపెనీ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. హరిత భవిష్యత్‌ దఙవగా తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తూ ఈ కార్యక్రమంతో, పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా ఇప్పుడు సమగ్రమైన ప్రభావాన్ని ప్రతి సంవత్సరం 7310 టన్నుల కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం ద్వారా తీసుకురానుంది. మెనో కార్టన్లను ప్యాకేజింగ్‌లో నిలిపివేయడం ద్వారా 2.5 లక్షల చెట్లను కాపాడటంతో పాటుగా 18745 టన్నుల వ్యర్ధాలు భూమిలో చేరకుండా అడ్డుకోవడమూ సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంతో 2030 నాటికి మొత్తంమ్మీద 75వేల టన్నుల ప్యాకేజింగ్‌ ఉద్గారాల విడుదలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం గురించి పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌, రంజిత్‌ ఓక్‌ మాట్లాడుతూ ‘‘పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా వద్ద, భూగోళంపై మార్పు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నాము. మహోన్నత ప్రభావం సృష్టించే దిశగా మేము మా సస్టెయినబిలిటీ ఎజెండాను విస్తరిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మా వాల్యూ చైన్‌ వ్యాప్తంగా అంటే గింజ మొదలు గ్లాస్‌ వరకూ ప్రతి దశలోనూ మా కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ను తగ్గించే దిశగా కృషి చేస్తున్నాము. ఈ కార్యక్రమం, మార్కెట్‌లో పర్యావరణ స్పృహతో కూడిన కొనుగోలు నమూనాల చుట్టూ మారుతున్న వినియోగదారుల అభిరుచులను సైతం వెలుగులోకి తీసుకువస్తుంది. పర్యావరణ స్పృహతో కూడిన వినియోగాన్ని అభ్యసించడం మరియు ప్రచారం చేయడం ద్వారా మా వాటాదారులు ప్రచారకర్తలుగా మారాలని , అతిపెద్ద ఉద్యమంగా దీనిని మార్చాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఉద్యమంలో మా పరిశ్రమ సహచరులు కొందరు ఇప్పటికే చేరడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కార్తీక్‌ మోహీంద్రా మాట్లాడుతూ ‘‘ఈ ప్రపంచం ఇప్పుడు నూతన యుగపు సస్టెయినబిలిటీ వైపు పయనిస్తుంది. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారుల అవసరాలు మేము తీరుస్తున్నాము. పర్యావరణం మరియు గ్రహంపై స్ధిరమైన ప్రభావాన్ని చూపే బ్రాండ్‌లు మరియు ఉత్పత్తులను వారు కోరుకుంటున్నారు. భారతదేశంలో గత 25 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాధ్యతాయుతమైన కార్పోరేట్‌ సంస్ధగా, పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా యొక్క కార్యకలాపాలలో సస్టెయినబిలిటీ అత్యంత కీలకంగా ఉంటుంది. మా నూతన ప్రచారం ‘# ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ , ఈ నిబద్ధతకు నిదర్శనంగా ఉంటుంది. ఈ ప్రచారం ద్వారా మేము కేవలం పర్యావరణ స్పృహ కలిగిన కొనుగోలు నిర్ణయాలకు స్ఫూర్తినందించడం మాత్రమే కాదు, ఈ మహోన్నత లక్ష్యాన్ని విజయవంతం చేసేలా ప్రేరేపించడం మరియు దీనిని పెద్ద ఉద్యమంగా తీర్చిదిద్దేలా మాకు సహాయపడేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం పట్ల మేము గర్వంగా ఉన్నాము మరియు పరిశ్రమ సహచరులు, భాగస్వాములు తమ ఆత్మను తెరిచి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా మన ప్లానెట్‌ కోసం మరొకరు అనేలా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము’’ అని అన్నారు.

ఈ కీలకమైన పర్యావరణ మరియు పరిశ్రమలో మొట్టమొదటి కార్యక్రమ స్వీకరణకు భరోసా అందించేందుకు, పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా ఇప్పుడు తమ వినియోగదారులు, ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు అత్యంత ఆప్రమప్తతతో వినియోగించాల్సిందిగా కోరుతూ ఓ ఉద్యమం ప్రారంభించింది. ఈ కంపెనీ ఇప్పుడు స్ధానిక కమ్యూనిటీలు, ఎన్‌జీఓలు, పరిశ్రమ సహచరులు మరియు వినియోగదారులతో చేతులు కలపడంతో పాటుగా సర్క్యులర్‌ ఆర్ధిక వ్యవస్ధకు మార్గమూ వేస్తుంది. ఈ ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా జరిగేందుకు ఈ కంపెనీ ఇప్పుడు రీ సైకిల్డ్‌, రీసైక్లిబల్‌ నెక్‌ ట్యాగ్స్‌ను పలు రాష్ట్రాలలో పరిచయం చేసింది. ఇది వినియోగదారులను ‘# ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా సృష్టించిన మైక్రోసైట్‌కు తీసుకువెళ్తుంది.

పరిశ్రమలో మార్పుకు నేతృత్వం వహిస్తూ ‘# ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ అత్యంత ప్రతిష్టాత్మకమైన ముందడుగుగా నిలుస్తుంది. ఇది భూగర్భంలోని ఎలాంటి వ్యర్ధాలూ చేరకూడదనే కంపెనీ నిబద్ధతను వెల్లడిస్తుంది. ఈ మైలురాయి కార్యక్రమం, కంపెనీ యొక్క ప్రతిష్టాత్మకమైన సస్టెయినబల్‌ ప్యాకేజింగ్‌ వ్యూహానికి అనుగుణంగా ఉండటంతో పాటుగా వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు మద్దతు అందిస్తుంది. దానితో పాటుగా పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుంది. ప్రతి దశలోనూ వ్యర్ధాలను గణనీయంగా తగ్గించాలనే నిబద్ధతతో, ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతో పాటుగా పంపిణీ చేయడం లక్ష్యంగా చేసుకుంది. వీటి ద్వారా ప్రకృతి వనరులు కాపాడటం, కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ తగ్గించడం, వాటర్‌ పాజిటివిటీ సృష్టించడంలో సహాయపడనుంది. దీని ప్యాకేజింగ్‌లు 100% రీసైకిల్‌ చేయతగినవి, కంపోస్టబల్‌ లేదా 2025 నాటికి పునర్వినియోగించతగినవిగా ఉంటాయి. ఈ కంపెనీ సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడంతో పాటుగా గ్లాస్‌ బాటిల్స్‌ను గరిష్టంగా పునర్న్వియోగించేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో వాటి నాణ్యతకు భరోసానూ అందిస్తుంది. అంతేకాదు, 2025 నాటికి తమ గ్లాస్‌ కంటెంట్‌లో 40% రీసైక్లిబల్‌ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరహా కార్యక్రమాలతో ,పెర్నార్డ్‌ రికార్డ్‌ ఇండియా ఇప్పుడు మొత్తంమ్మీద తమ కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ను 2030నాటికి 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు నీటి పరిరక్షణ కార్యక్రమాలను రెడ్యూస్‌ , రీయూజ్‌ , రీసైకిల్‌ , రీచార్జ్‌ విధానంతో ముందుకు వెళ్తుంది.

‘# ఒన్‌ ఫర్‌ అవర్‌ ప్లానెట్‌’ ను పెర్నార్డ్‌ రికార్డ్‌ యొక్క అంతర్జాతీయ 2030 సస్టెయినబిలిటీ మరియు రెస్పాన్సిబిలిటీ రోడ్‌మ్యాప్‌ – గుడ్‌ టైమ్స్‌ ఫర్‌ గుడ్‌ ప్లేస్‌కు అనుగుణంగా తీర్చిదిద్దింది. తమ రోడ్‌మ్యాప్‌కు నాలుగు మూల స్థంభాలుగా పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు తగిన విలువ నందించడం, సర్క్యులర్‌మేకింగ్‌ మరియు బాధ్యతాయుతమైన హోస్టింగ్‌ ఉన్నాయి. యునైటెడ్‌ నేషప్స్‌ సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ)కు అనుగుణంగా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుంటూనే తమ వ్యాపారపరంగా అన్ని సమస్యలనూ పరిష్కరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News