న్యూఢిల్లీ: అవిభక్త రాష్ట్రంలో రిజర్వేషన్లు పొందిన వ్యక్తి రాష్ట్రాల పునర్విభజన తరువాత ఏదేనీ ఒక్క రాష్ట్రంలో ఆ కోటాకు అర్హులు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాలలో ఈ కోటాను పొందడం కుదరదని స్పష్టం చేసింది. అవిభక్త బీహార్‌లో రిజర్వేషను దక్కించుకున్న తరువాత ఏర్పడ్డ బీహార్ లేదా జార్ఖండ్ రాష్ట్రాలలో కోటా కల్పన అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. రిజర్వ్‌డ్ కేటగిరిలో స్థానం దక్కించుకున్న వర్గాలకు చెందిన అభ్యర్థులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు అయితే వారు జార్ఖండ్‌లో ఏదేనీ పోటీ పరీక్షలలో పాల్గొంటే వారిని వలస అభ్యర్థులుగానే భావిస్తారని, వారు జనరల్ కేటగిరిలోనే పోటీకి అర్హత దక్కించుకుంటారని, రాష్ట్రాల విభజన తరువాత తాను ఏ రాష్ట్రానికి చెందిన వాడనేదానిపై ఆధారపడే కోటా ఖరారు అవుతుందని, ఇంతకు ముందటి రాష్ట్రం పరిధిలో ఉండే కోటాను పరిగణనలోకి తీసుకుని ఇరు రాష్ట్రాలలో కోటా అర్హత కుదరదని తేల్చిచెప్పారు. పంకజ్‌కుమార్ అనే వ్యక్తి రిజర్వ్‌కోటా ఉద్యోగం విషయంలో దాఖలు అయిన పిటిషన్‌కు సంబంధించిన విచారణ క్రమంలో ఈ తీర్పు వెలువడింది. పలు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఈ రిజర్వేషన్ల కోటా, ఉద్యోగాల విషయాలు వివాదాస్పదం అవుతూ వచ్చాయి.
Person can claim quota in any state on reorganization