Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ ః మండల శివారు ప్రాంతమైనన దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం అర్థ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముర్కుటే ఏక్‌నాథ్ (45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎల్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసుల, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం … మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఏక్‌నాథ్ అతని అన్న కుమారుడైన వినోద్‌లు కలిసి ఆదివారం సాయంత్రం పల్సర్ బైక్ పై ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నా బంధువైన ముర్కుటే ప్రభును పరార్శించేందుకు వెళ్లారని తెలిపారు.

రాత్రి 11 గంటల సమయంలో ఆదిలాబాద్ నుండి లింగాపూర్‌కు వస్తుండగా వారు ప్రయాణిస్తున్నా మోటర్ సైకిల్ దేవాపూర్ చెక్ పోస్ట్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో ఏక్‌నాథ్‌కు తీవ్ర గాయాలు కాగా వినోద్ స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఏక్‌నాథ్ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సోధరుడు త్రిముఖ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News