Thursday, December 19, 2024

రోడ్డు దాటుతూ వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణం ఎల్బీ నగర్ కు చెందిన తోట కృష్ణ (40) రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో రోజు లాగా ఈరోజు కూడా కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగు ప్రయాణంలో (163) నేషనల్ హైవే రోడ్డు సింగన్నగూడెం చౌరస్తా వద్ద కాలినడకన

రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళుతున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుకుంటూ కృష్ణను ఢీకొట్టాడు. కృష్ణ లారీ కింది తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని శివ పరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇట్టి కేసులో పోలీసులు వివరాలు సేకరించి,దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News