Monday, January 20, 2025

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: ట్రాక్టర్‌పై నుంచి కింద పడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన చాకలి బాలయ్య(62) గ్రామపంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం విధుల్లో భాగంగా సాయంత్రం సమయంలో చెత్తను పారబోయడానికి ట్రాక్టర్‌పై డ్రైవర్, మరో పారిశుధ్య కార్మికుడితో కలిసి వెళ్లాడు. తిరిగి చెత్త ఖాళీ చేసి వస్తుండగా గుంతలో కుదుపులకు ట్రా క్టర్‌పై నుంచి కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ ట్రాలీకి మద్య ఉన్న రాడ్డుపై పడటంతో తల, శరీరానికి గాయాలయ్యాయి. తోటి వారు వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు వెంటనే మెదక్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబద్ తరలిస్తుండగా అర్థరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. అల్లుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News