Sunday, December 22, 2024

మారేడుపల్లిలో స్నేహితుడి భార్యతో జంప్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శిరీడికి వెళ్తున్నానని చెప్పి ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యతో పారిపోయిన సంఘటన హైదరాబాద్‌లోని మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. న్యూబోయిన్‌పల్లిలో అతుల్ అనే వ్యక్తి వ్యాపారం చేసేవాడు. మే 29న తన భార్యతో శిరిడీకి వెళ్తున్నానని చెప్పాడు.

Also Read: మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?

మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడంతో భార్య కొంచెం అనుమానం కలిగింది. అతుల్ భార్యకు భర్త రాసిన లేఖ కనిపించింది.  తన స్నేహితుడి భార్యతో కలిసి పారిపోయానని,  తన స్నేహితుడికి ఈ విషయం తెలుసునని, తన కోసం వెతకవద్దని లేఖలో పేర్కొన్నాడు. పది లక్షల రూపాయల నగదుతో ఇంట్లో నుంచి పారిపోయాడని అతుల్ భార్య మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News