Sunday, April 20, 2025

విండ్ టర్బైన్ నుంచి జారాడు.. కానీ చివరకు..

- Advertisement -
- Advertisement -

అనంతపురం: ఈ భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ప్రమాదంలో అయినా బతికిపోతారు. అలానే ఈ వ్యక్తి బతికాడు. విండ్ టర్బైన్ నుంచి జారినా అతను సిబ్బంది, స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి గట్టెక్కాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులోని విండ్ టర్బైన్‌ను సర్వీస్ చేసేందుకు సుందరేశ్ అను వ్యక్తి పైకి ఎక్కాడు. అయితే అక్కడ పట్టుతప్పి కిందకు జారాడు. రోప్ సహాయంతో చాలాసేపు గాల్లో అత్యంత ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుందరేశ్‌ను కాపాడ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News