Sunday, January 12, 2025

చెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

చేర్యాల : చెరువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. చేర్యాల ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… చేర్యాల పట్టణంలో నివాసముంటున్న అంకం పుల్లయ్య(82) గత కొన్ని రోజులుగా పెరాల్సిస్ , బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో బాదపడుతూ వైద్యుల సూచనల మేరకు రోజు ఉదయం వాకింగ్ చేసుకుంటూ ఉండేవాడని రోజులాగే బుధవారం ఉదయం వాకింగ్ నిమిత్తం చేర్యాల పెద్ద చెరువు కట్టపై వెళ్లినాడని అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చెరువులో పడి మృతి చెందినట్లు తన కొడుకు అంకం కిష్టయ్య (సబ్ రిజిస్టర్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News