Friday, December 20, 2024

అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

అనుమానస్పదస్థితో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన టపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నాగర్ కర్నూర్‌లో కాంట్రాక్ట్ పని మీద వెళ్లిన సమీర్ అనే వ్యక్తి తాగి వాహనం పై నుంచి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేయించుకొని నాగర్‌కర్నూల్ నుంచి నగరంలోని తాళ్లగడ్డకు చేరుకున్నాడు. రాత్రి పడుకున్న సమీర్ గురువారం ఉదయం లేవకపోవడంతో తోటి కార్మికులు కాంట్రాక్టర్‌కు సమాచారమిచ్చారు. సమీర్ లైటింగ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు, పనిమీది నాగర్‌కర్నూలు వెళ్లాడు. సమీర్ మృతిచెందిన విషయం కాంట్రాక్టర్ పోలీసులకు చెప్పాడు.

వెంటనే టపాచబుత్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమీర్ మృతి పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యక్తి ప్రమాద శాతం మృతి చెందాడా? లేక తాగిన పిమ్మట తోటి కార్మికులతో గొడవ ఏమైనా అయ్యిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తోటి కార్మికులను విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News