Sunday, September 8, 2024

రాష్ట్రంలోని వ్యక్తికి పాజిటివ్

- Advertisement -
- Advertisement -

 Corona virus

 

పి.14 పేషెంట్‌తో సన్నిహితంగా మెలిగిన స్థానిక వ్యక్తికి సోకిన వైరస్
ఈ తరహాలో కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి
21కి చేరిన కరోనా బాధితులు
వైద్యాధికారులు మరింత అప్రమత్తం

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో నివసించే స్థానిక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన పాజిటివ్ 14 వ్యక్తి నుంచి తాజాగా హైదరాబాద్‌కి చెందిన మరోక వ్యక్తికి (35)కి వ్యాధి సంక్రమించినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్ ఫలితాలు వచ్చేవి. కానీ తొలిసారిగా ఈ తరహాలో కేసు నమోదు కావడం అందిరిని ఆందోళన కల్గిస్తోంది. దీంతో పాటు దుబాయ్ నుంచి వచ్చిన మరోక వ్యక్తికి (33) కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించారు. అంటే శనివారం వెల్లడించిన రిపోర్టులో ఇద్దరి వ్యక్తులకు పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21కి చేరింది. వీరందరికి గాంధీ, చెస్ట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

అయ్యప్పసొసైటిలో కరోనా కలకలం…
హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పూణేకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల లండన్ నుంచి వచ్చి అయ్యప్ప సొసైటిలో తన రూం వద్ద వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అయితే అతనికి తీవ్రమైన జ్వరం, దగ్గు ఉండటంతో ఇంటి యజమాని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

విదేశాల నుంచి వచ్చే వారి చేతులకు స్టాంప్‌లు…
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చే వ్యక్తుల చేతులకు అధికారులు ముద్రలు వేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీయులు రాగానే, వారికి ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ అనే పేరుతో ప్రత్యేక ముద్రలను అధికారులు వేస్తున్నారు. ఎన్నికల్లో వినియోగించే సిరా తో ఈ ముద్రలు వేస్తున్నారు. క్వారంటైన్ సమయం 14 రోజుల పాటు ఈ స్టాంప్ చేతికి ఉండాలని సదరు వ్యక్తులకు అధికారులు సూచిస్తున్నారు. మార్చి 1వ తేది నుంచి ఇప్పటి వరకు సుమారు 20వేల మంది విదేశీయులు రాష్ట్రానికి రాగా, 11వేల మంది తమ పర్యవేక్షణలో ఉన్నారని, మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

700 మందికి అనుమానిత లక్షణాలు..
మార్చి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల మంది విదేశీయులు రాగా, వీరిలో దాదాపు 700 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 14 రోజుల తర్వాత టెస్టులు అనంతరం వీరిని ఇంటికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో విదేశీయుల్ని గుర్తించే పనిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని డిహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.

 

Person in state is infected with Corona virus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News