Wednesday, January 22, 2025

దుర్గం చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చి గుర్తుతెలియని వ్యక్తి చెరువులోకి దూకాడు. బాధితుడికి ఈత రాకపోవడంతో మృతిచెందాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తునారు. అలాగే వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ గొడవలా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేకుని దర్యాప్తు చేస్తున్నమని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News