Wednesday, January 22, 2025

తొలిసారి జనంపై లంక ఖాకీ తూటా

- Advertisement -
- Advertisement -

Person killed in police on protesters in Sri Lanka

ఓ వ్యక్తి మృతి పలువురికి గాయాలు
ధరలపై మండిపడ్డ లక్ష మంది జనం
రాంబుక్కసలో నిరసనల సెగలు

కొలంబో : రగులుతున్న శ్రీలంకలో మంగళవారం నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలు వీధులలోకి వస్తున్నారు. రాజధాని కొలంబోకు 95 కిలోమీటర్ల దూరంలోని రాంబుక్కనలో ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నినదాలతో రహదార్లను స్తంభింపచేశారు. వారిలో ఓ గుంపు అక్కడున్న పోలీసు దళాలపై రాళ్లు ఇటుకలు విసిరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనివార్యంగా పోలీసులు తొలుత లాఠీచార్జి జరిపి తరువాత కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోగా పలువురికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకగా ప్రజలు ఉద్యమిస్తున్న దశలో వారిపై పోలీసు కాల్పులు జరగడం ఇదే తొలిసారి. రాంబుక్కసలో దాదాపు లక్ష మంది వరకూ గుమికూడారు. ఈ ప్రాంతం అంతా నిరసనల భగ్గుతో నినాదాల హోరుతో దద్దరిల్లింది. రాజధాని కొలంబోకు వెళ్లే రాదార్లన్నింటిని జనం దిగ్బంధించారు ఈ దశలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News