Tuesday, March 25, 2025

దారుణం.. కారుతో ఢీకొట్టి.. గొడ్డలి, కత్తితో నరికి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోకి ఎల్‌బినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మహేశ్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. మహేశ్ ఇటీవలే ఓ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే మహేశ్‌ని ముందుగా కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతను పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంటాడి మరి కత్తులు, గొడ్డలితో నరికి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News