Monday, December 23, 2024

ఎఫ్‌ఐఆర్‌లో పేరులేని వ్యక్తి ఇతరులపై ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరరాదు

- Advertisement -
- Advertisement -

Person not named in FIR cannot seek quashing of proceedings

న్యూఢిల్లీ: ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొనని వ్యక్తి ఒక క్రిమినల్ కేసులో మరో వ్యక్తికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కొట్టివేయాలని కోరడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లక్నోలోని హజారీబాగ్ పోలీసు స్టేషన్‌లో నమోదయిన యుపిపిసిఎల్ ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణం కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మొదట్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసును ఆ తర్వాత సిబిఐకి బదిలీ చేశారు. ‘ పైన పేర్కొన్న నేరంలో పిటిషనర్లను నిందితులుగా పేర్కొనలేదనే విషయం సుస్పష్టం. ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌ను కానీ, దర్యాప్తును కానీ కొట్టివేయడం అనే ప్రశ్నే తలెత్తదు. ఎందుకంటే వారికి అలా కోరే హక్కు లేదు’ అని బెంచ్ స్పష్టం చేసింది.

మరో విధంగా చెప్పాలంటే పైన పేర్కొన్న నేరంలో కానీ, ఆ నేరం ఆధారంగా ప్రస్తుతం సిబిఐ నమోదు చేసిన కేసులో కానీ నిందితులుగా పేర్కొనబడని వారికి ఇతర వ్యక్తులకు( నిందితులు) సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరడానికి అనుమతించకూడదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. హుకుంచంద్ గార్గ్, ఇతరులు కోరిన ఉపశమనాన్ని పరిశీలించాలని కోర్టు అనుకోవడం లేదని బెంచ్ స్పష్టం చేస్తూ , వారు ఈ నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో సిబిఐ వారి పేర్లను చేర్చినప్పుడు వారు తగు మార్గాన్ని ఎంచుకోవచ్చని కూడా ఇటీవల ఇచ్చిన తీర్పులో బెంచ్ స్పష్టం చేసింది. అయితే వారు తగుమార్గాన్ని ఎంచుకొవడానికి వీలుగా సిబిఐ దర్యాప్తు అధికారి పిటిషనర్లకు 48 గంటలు ముందుగా నోటీసు ఇవ్వాలని బెంచ్ స్పష్టం చేసింది. కాగా ఇంతకు ముందు పిటిషనర్లపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఈ ఆదేశాలతో రద్దయినట్లుగా భావించాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News