Monday, December 23, 2024

ప్రతీ మనిషి ఆరు మొక్కలు నాటాల్సిందే: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత దేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రస్తుతం మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నామని, సిఎం కెసిఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదన్నారు. 100 శాతం ఆక్సిజన్ పీల్చు కోవాలంటే ప్రతీ మనిషి ఆరు మొక్కలు నాటాలని సూచించారు. కొన్ని విదేశాల్లో మనిషికీ ఆరు వేల మొక్కలు నాటబడ్డాయన్నారు. కొన్ని దేశాల్లో మొక్కలు ఖచ్చితంగా నాటితేనే వివాహాలు, పిల్లల కోసం నిబంధనలు ఉన్నాయని చెప్పారు. మొక్కలు నాటి సంరక్షించుకుని భవిష్యత్ తరాలకు ఆరోగ్య కరమైన వాతావరణం ఇవ్వాలన్నారు. మొత్తం నల్గొండ పట్టణంలో ఇప్పటికే 15 లక్షలకు పైగా మొక్కలు నాటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News