Wednesday, January 22, 2025

విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.10లక్షల విలువైన విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఒమర్ బిన్ ఇలియాస్ జుంబాలి జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. వచ్చే డబ్బులు తన అవసరాలకు తీరకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు.

ఈ డబ్బులతో కుటుంబ అవసరాలు తీరడంలేదు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. కిరణా షాపులో విదేశీ సిగరేట్లను విక్రయించాలని ప్లాన్ వేశాడు. వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు దాడి చేసి విదేశీ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ అజయ్‌కుమార్, ఎస్సైలు నవీన్, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News