Friday, December 20, 2024

కేంద్ర మంత్రి కుమారుడి ఇంట్లో కాల్పులు: ఒకరి హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడి ఇంటి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఒక 30 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కాల్పులలో మరణించాడు.

వినయ్ శ్రీవాస్తవ(30) అనే వ్యక్తి హత్యపై తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసు జాయింట్ కమిషనర్ (క్రైమ్) ఆకాష్ కుల్హారీ తెలిపారు. కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ నివాసం వద్ద తుపాకీ కాల్పులలో వినయ్ శ్రీవాస్తవ మరణించినట్లు ఆయన తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు ఠాకూర్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.

లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ నియోజకర్గం బిజెపి ఎంపి, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారం దర్యాప్తులో ఉందని చెప్పారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగిందని, తన కుమారుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని ఆయన చెప్పారు.

మృతుడి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వినయ్ శ్రీవాస్తవ గురువారం రాత్రి వికాస్ కిషోర్ నివాసానికి వెళ్లాడు. అజయ్ రావత్, అంకిత్ వర్మ, షమీమ్, బాబా అక్కడ ఉంటున్నారు. తన సోదరుడితో వారంతా డిన్నర్ చేశారు. వారి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఇంతలో తన సోదరుడిపై కాల్పులు జరిగాయి. తన సోదరుడు కాల్పులలో అక్కడికక్కడే మరణించాడు అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News