Tuesday, April 8, 2025

చోరీ కేసులో విచారణకు పిలిస్తే.. పురుగులమందు తాగి…

- Advertisement -
- Advertisement -

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. పురుగుల మందుతాగి వంశీకృష్ణ అనే వ్యక్తి మంగళవారం చనిపోయాడు. పోలీసులు చోరీ కేసులో అనుమానితుడిగా వంశీని విచారణకు పిలిచారు. విచారణకు పిలిచి అనుమానించారని వంశీకృష్ణ మనస్తాపం చెందాడు. వంశీ సోమవారం గీసుకొండ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. అప్పటికే పురుగులమందు తాగేశాడు. దీంతో పిఎస్ ముందు కుప్పకూలిపోవడంతో బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ వంశీ తనువు చాలించాడు. పోలీసులు వేధింపుల వల్లే వంశీకృష్ణ మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News