- Advertisement -
జగిత్యాల : ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి ఎటిఎంకి వెళ్తే, ఆ ఎటిఎంలో నగదు కనిపించింది. ఆ డబ్బుని తాను తీసుకోకుండా పోలీస్ వారికి అందజేసిన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఎస్ బిఐ ఎటిఎం లో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఎటిఎం మిషన్ లో అప్పటికే ఉన్న డబ్బులు రూ. 9000/- గమనించి డబ్బులను నిజాయితీగా జగిత్యాల డిఎస్ పి ప్రకాష్ గారికి అందచేసిన పిఆర్ టియుటిఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి. ఈ సందర్భంగా డిఎస్ పి ప్రకాష్ ఆయన్ను అభినందించారు. ఆయన వెంట పిఆర్ టియుటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు ఉన్నారు.
- Advertisement -