మన తెలంగాణ/ హైదరాబాద్ : విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న డ్రగ్ పెడ్లర్‌ను ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు రామచంద్రాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద డ్రగ్స్ సరఫరాదారుడు, విక్రేత మహమ్మద ఆస్రఫ్ బేగ్ అనే అరబిక్ ట్యూటర్ ని డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి 13 గ్రాములు కోకైన్ , ఓ ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్, రూ.64300 నగదును మొత్తం రూ.3.92లక్షల విలువైన వస్తువులను స్వాధీనం ఎస్‌ఓటి పోలీసులు చేసుకున్నారు. ప్రధాన డ్రగ్స్ సప్లైయిర్ నైజీరియా దేశానికి చెందిన జూడ్ అనే వ్యక్తి గోవా కేంద్రంగా డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తున్నారని, అతని నుంచి ఆస్రఫ్ బేగ్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి ఇక్కడ విద్యార్థులకు అమ్ముతున్నారని వెల్లడించారు. ఆస్రఫ్ బేగ్‌ను 2021లో రాయ్‌దుర్గం పోలీసుసేష్టన్ ఎన్‌డిపిఎస్ కేసులో అరెస్టు చేసిన జ్యూడిషరీ కస్టడీకి తరలించగా 2021 డిసెంబర్ లో విడుదలైన అతను డ్రగ్ అమ్ముతున్నట్లు జూన్‌లో సమాచారం అందిందన్నారు. అప్పటీ నుంచి అతనిపై ప్రత్యేక నిఘా పెట్టి శుక్రవారం రెడ్ హ్యాండెండ్‌గా పట్టికున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం జూడ్ ఆప్‌స్కాడింగ్‌లో ఉన్నారని అతని కూడ త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.