Thursday, December 26, 2024

‘ఎస్’ అంటేనే సిఇసినా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరికి జీ హుజుర్‌లు కొట్టని ధైర్యవంతుడై ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. యస్ బాస్‌ అనకుండా, అవసరం అయితే దేశ ప్రధానిపై కూడా చర్యలు తీసుకునే ధైర్యం ఉన్నవ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావల్సిన అవసరం దేశానికి ఇప్పుడు ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌తో కూ డిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాస నం సంబంధిత అంశంపై దాఖలు అయిన పి టిషన్లపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్య లు చేసింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామక పత్రాల ను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు దేనికీ భయపడని ఎన్నికల ప్రధానాధికారి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు అనుకోకుండా ఎన్నికలకు సంబంధించి ప్రధాన మంత్రిపై ఏదైనా ఆరోపణ వచ్చిందునుకోండి, దీనిపై సిఇసి స్పందించగలగా లి. అయితే ఇప్పుడు సిఇసి బలహీనపు స్థితి లో, మోకరిల్లే పరిస్థితులలో ఉంటున్నారు.

కానీ చర్యలకు దిగడం లేదు. ఇది ఎందుకు జరుగుతోంది. ప్రాధేయపడే రీతిలో ఉండే వ్యక్తి ఉన్నత స్థానంలో ఉండటంతో ఈ బాధ్యతలకు న్యాయం చేయగలిగే స్థితి ఉంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ బాధ్యతల్లో ఉండే వ్యక్తి స్పందించకపోతే ఇక సంబంధిత కీలక వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం కాదా? అని రాజ్యాంగ నిలదీసింది. ఎన్నికల వ్యవస్థ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకం. ఇందులో దీనికి పర్యవేక్షక బాధ్యతలలో ఉండే సిఇసి పదవి మరీ ప్రాధాన్యం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. అతీతంగా వ్యవహరించాలి. స్వతంత్రంగా నిలవాలి. ప్రణమిల్లే పరిస్థితి ఉంటే పడిపోతుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కీలక విషయాలన్నింటిని మనం విశ్లేషించుకోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ ఇతరత్రా కీలక పదవులకు ఎంపికలకు సంబంధించి మనకు స్వతంత్రమైన విస్తృత సంస్థ లేదా వ్యవస్థ అవసరం ఉంది.

కేవలం కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా సిఇసి నియామకం జరిగితే, సహజంగానే ఇందుకు అనుగుణంగా కేబినెట్‌ను ధిక్కరించలేని స్థితి ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ అనూప్ బరన్‌వాల్ తరఫున సుప్రీంకోర్టు ముందు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తమ వాదనలు విన్పించారు. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకంలో ఏదైనా గోల్‌మాల్ లేదా గూడుపుఠాణి ఉందా? దీనిని తాము తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇటీవలే సర్వీసు నుంచి విరమణ పొందిన వ్యక్తికి ఉన్నత పదవి ఇవ్వడం అనుమానాలకు దారితీసింది. అయితే గోయల్ నియామకం ఫైల్‌ను కోర్టు ఇప్పటి విచారణ క్రమంలోనే పరిశీలించడంపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వీటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇసి, సిఇసిల నియామకానికి సంబంధించి కొలీజియం తరహా ఏర్పాటు ఉండాలనే పిటిషన్ల విచారణ గత గురువారం ప్రారంభం అయింది.ఈ దశలోనే గోయల్‌ను ఇసిగా నియమించారు. ఈ చర్యకు ఎందుకు దిగారనేది కనుక్కోవల్సి ఉందని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.

మార్పులు కావాలనేవి కేవలం అరుపులేనా?

ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలనే విషయం చాలా కాలంగా చర్చకు దారితీస్తోంది. సంబంధిత విషయంపై పలు కమిటీలు ఏర్పడ్డాయి. అనివార్యంగా తక్షణం కీలక మార్పులు జరగాలని ప్రతిపాదనలు వెలువరించారు. పైగా పదవులలో ఉన్న వారు రాజకీయ నాయకులు కూడా సంబంధింత విషయంపై దాదాపుగా ఇళ్ల పైకి ఎక్కినట్లుగా మార్పులు చేపట్టాలని నినదించారని అయితే జరిగిందేమి లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. టిఎన్ శేషన్ వంటి పటిష్ట నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తి సిఇసి బాధ్యతలలో ఉండాలని ఇటీవలే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన తరువాత ఇప్పుడు ఈ స్పందన వెలువడింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్‌తో పాటు అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేశ్ రాయ్, సిటి రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. తాము ప్రచారం కోసం పాకులాడటం లేదని, కేవలం ఈ వ్యవస్థకు సముచితమైన వ్యక్తి సారధ్యం వహించాలని, సిఇసిగా ఉండాలనేదే తమ తపన అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇంతకు ముందు పలువురు సిఇసిలు వచ్చారు. వెళ్లారు. అయితే టిఎన్ శేషన్ వంటి వారు ఎప్పుడో ఓసారి వస్తారని , అయితే ఇటువంటి వారు చిరకాలం గుర్తుంటారని తెలిపారు. తాము కోరుకునేది ఒక్కటే సిఇసిని ఎవరూ బుల్‌డోజ్ చేసే పరిస్థితి ఉండరాదని , ఆయన అధికారాలను ప్రభావితం చేయడం ఎవరి తరమూ కాకూడదని రాజ్యాంగ ధర్మాసనం తీవ్రస్థాయిలో తెలిపింది. ఇప్పుడు వ్యవస్థలో అత్యధిక అధికారాలు ఇద్దరు ఇసిలు, ఓ సిఇసి బలహీన భుజస్కందాలపై ఉన్నాయి. వీరు తమ శక్తి చాలని రీతిలో నిర్ణయాలు తీసుకుంటే వ్యవస్థ ఏ విధంగా బలంగా ఉంటుందని ప్రశ్నించారు. 2004 నుంచి ఇప్పటివరకూ దేశంలో ఏ సిఇసి కూడా ఆరేళ్ల పూర్తి పదవీకాలం పూర్తి చేసుకోలేదనే విషయాన్ని విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సిఇసిలు, ఇసిల నియామాకంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని ఈ మేరకు ఆదేశాలు వెలువరించాలనే పలు పిటిషన్లపై ఈ నెల 17న కేంద్రం తన అభ్యంతరాలను సుప్రీంకోర్టుకు తెలియచేసుకుంది. ఇది కుదరని పని అని తేల్చిచెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News