Monday, January 20, 2025

మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు సరికావు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత ఆరోపణలు సరికావని భారత రాష్ట్ర సమితి, కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏరాపటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరైంది కాదని, ఇలాంటివి పునరావృతం అయితే సహించేది లేదని అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దశాబ్ది ఉత్సవాలు దగా అంటున్న పొన్నంకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పొన్నం ప్రభాకర్ దశాబ్ది ఉత్సవాలకు దగా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స్కాంలతో నిండిపోయి స్కాంగ్రెస్ అని పేరు వచ్చింది..మీరు అవుట్ డేటెడ్ కాకుంటే ఇంకేంటని పొన్నంను ప్రశ్నించారు.కరీంనగర్ ప్రజలు ఎప్పుడోమరచిపోయారు పొన్నం గుర్తు పెట్టుకో అని సూచించారు. మంత్రి గంగులతోఅభివృద్ధిలో పోటీపడే పరిస్థితి లేకపోవడం తో బట్టకాల్చి మీద వేయాలని మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం నీ పరిణితి ఎంటో అర్థం అవుతుందని, పిచ్చి పిచ్చి మాటలు ఇకమీదట మానుకోకుంటే నాలుక కొస్తామని హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో ఒక్కరినీ గెలిపించుకోలేని నువ్వు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా గంగులను విమర్శించి వాడివా అని పొన్నంపై ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం బండి సంజయ్ ఒక్కరూపాయి అయినా తీసుకవచ్చాడని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజలకు అందిస్తుంటే ప్రజాదరణ ఒర్వలేకనే బండి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధిలో ఏమాత్రం దృష్టి పెట్టని బండికి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదని హితవు పలికారు.
ప్రజలు చైతన్యవంతులు అయ్యారని మాజీ ఎంపీ పొన్నం, బండి సంజయ్‌లకు తగిన గుణపాఠం చెబుతారని, వారి ఆటలు ఇకపై సాగనివ్వరని జోష్యం చెప్పారు. కరీంనగర్ అన్ని రంగాల్లో మంత్రి గంగుల సారథ్యంలో ముందుకు సాగుతుంటే ఒర్వలేక చౌకబారు ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్సే అధికారంలోకి వచ్చి హైట్రిక్ సాధిస్తుందని, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మరని, సీఎం కేసీఆర్‌కే పట్టం కడుతారని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మీర్ షౌకత్‌అలీ, దీకొండ కుల్ దీప్ వర్మ, వాజిద్, సాయి కృష్ణ, ఆరె రవి గౌడ్, వొడ్నాల రాజు, నారదాసు వసంతరావు, సత్తినేని శ్రీనివాస్, మహ్మద్ అఫ్రోజ్ ఖాన్, గందె కల్పన , కర్రె పావని, అజంతా, నవీన్, శరత్ చంద్ర, జెల్లోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News