Tuesday, April 8, 2025

పుతిన్, లావ్రోవ్‌లపై వ్యక్తిగత ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Personal sanctions against Putin and Lavrov

వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌లపై అమెరికా అరుదైన ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై దాడికి వారే బాధ్యులని పేర్కొంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఈ వారం రష్యాపై ఆర్థిక ఆంక్షలు కూడా విధించాయి. దీనికి తోడు అమెరికా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, సైనిక జనరల్ వాలెరీ గెరాసిమోవ్‌పై కూడా ఆంక్షలు విధించింది. పుతిన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతర్జాతీయ సంకీర్ణాన్ని నిర్మించారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి డెయిలీ న్యూస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులకు చెప్పారు. కాగా పుతిన్, లావ్రోలపై విధించిన ఆంక్షలను సెనేటర్ జాక్ రీడ్ స్వాగతించారు. ఆంక్షల కారణంగా రష్యా కరెన్సీ విలువ బాగా పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News