Monday, January 20, 2025

విద్యార్థుల వీడియో వైరల్…. ఇద్దరు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వ్యక్తిగత వీడియోలు బయటకు రావడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం దేవన్‌గర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కాలేజీ భవనం పైన బాలుడు, బాలిక మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ సభ్యులకు చేరాయి. దీంతో కుటుంబ సభ్యుల ఎదుట తల ఎత్తుకొని తిరగలేక శుక్రవారం బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి శనివారం బాలుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఎవరు తీశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సర్య్కూ లేట్ చేసిన వారి గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read: కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన.. తల్లి ప్రేమ (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News