Monday, December 23, 2024

పెరూ మాజీ అధ్యక్షుడు టొలెడోకు 20 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

లాటిన్ అమెరికా వ్యాప్తంగా అవినీతికి మారుపేరుగా మారిన బ్రెజిలియన్ నిర్మాణ దిగ్గజ సంస్థ ఓడెబ్రాస్ట్‌కు ప్రమేయం ఉన్న ఒక కేసులో పెరూ మాజీ అధ్యక్షుడు అలెజాండ్రో టొలెడోకు 20 ఏళ్లు, ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఆ సంస్థ ప్రభుత్వ అధికారులు, ఇతరులకు అనేక మిలియన్ల డాలర్ల మేర లంచాలు చెల్లించింది. దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఒక రహదారి నిర్మాణానికి అనుమతించినందుకు ప్రతిగా ఓడెబ్రాష్ట్ నుంచి టొలెడో 35 మిలియన్ డాలర్ల మేర లంచాలు స్వీకరించినట్లు అధికారులు ఆరోపించారు.

ఏళ్ల తరబడి కోర్టు లావాదేవీలు సాగిన తరువాత రాజధాని లిమాలోని ప్రత్యేక క్రిమినల్ న్యాయానికి చెందిన నేషనల్ సుపీరియర్ కోర్టు టొలెడోకు ఆ శిక్ష విధించింది. 2001 నుంచి 2006 వరకు పెరూను పాలించిన టొలెడోను అమెరికా నుంచి తిరిగి రప్పించేలా చేయవచ్చా అనే వివాదం కూడా వాటిలో ఉన్నది. పెరూలో టొలెడో, మరి ముగ్గురు మాజీ అధ్యక్షుడు ఆ నిర్మాణ దిగ్గజం నుంచి ముడుపులు అందుకున్నారని అధికారులు ఆరోపించారు. అయితే, తనపై ఆరోపణలను టొలెడో ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News