లిమా: పెరూ అధ్యక్షురాలి చేతికి ఖరీదైన వాచ్‌పై న్యూస్ రావడంతో, ఆమె అధ్యక్ష భవనంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె అవినీతికి పాల్పడ్డారా? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఆమె అధ్యక్షభవనంలో లేరు. పెరూ అధ్యక్షురాలు డీనా బోలువార్టే తన చేతికి ఖరీదైన రోలెక్స్ వాచ్ పెట్టుకుంది. వాచ్‌పై మీడియాలో కథనాలు రావడంతో 20 మంది అవినీతి నిరోధక శాఖ అధికారులు, 20 మంది పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు.
పెరూ దేశపు అత్యున్నత న్యాయస్థానం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలోనే అధికారులు సోదాలు చేపట్టారు. 2022 నుంచి ఆమె పెరూ దేశపు అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని అప్పటి అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో రద్దు చేయాడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఆయన్ని అధికారం నుంచి తొలగించి పెరూ పీఠంపై డీనా ఆశీనులయ్యారు. పెరూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ దేశంలో అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు రుజువైతే పదవీ కాలం ముగిసే వరకు చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఆమె 2026లో పదవీ నుంచి దిగిపోనున్నారు. ఖరీదైన వాచ్‌పై కొనుగోలుపై ఆమెను మీడియా ప్రశ్నించింది. దీంతో తాను 18 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని, స్వశక్తితో ఖరీదైనా వస్తువులు కొనుక్కున్నానని, స్వచ్ఛంగా అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టానని వివరణ ఇచ్చారు. తనపై అవినీతి లేకుండానే ఇక్కడ నుంచి వెళ్తానని డీనా జవాబిచ్చారు.