Sunday, December 22, 2024

ముషారఫ్ ఆరోగ్యం విషమం

- Advertisement -
- Advertisement -

 

Musharraf
లాహోర్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకోవడం కష్టమేనని కుటుంబసభ్యులు తెలిపారు. ముషారఫ్ అమైలాయిడోసిస్ అనే రుగ్మతతో బాధపడుతున్నారని, ఆయన అవయవాలు పనిచేయడం లేదని వారు తెలిపారు. అవయవాల్లో ప్రొటీన్ అసాధారణంగా పోగుపడి, అవయవాలు పనితీరు దెబ్బతినడాన్నే మెడికల్ టెర్మినాలజీలో అమైలాయిడోసిస్ అంటారు. ఇది చాలా అరుదైన వ్యాధి. పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టిలో ముషారఫ్ పరారీలో ఉన్న నిందితుడు. ఆయనపై పాక్‌లో దేశద్రోహం అభియోగం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News