Sunday, January 19, 2025

పంట మార్పిడితో చీడపీడలు దూరం

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డిపేట :వ్యవసాయ రంగంలో పంట మార్పిడి పద్దతి నేడు అత్యంత ప్రాచూర్యం సంతరించుకుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాస్కర్ తెలిపారు. పంటల సస్యరక్షణలో చీడపీడలు దూరమై ఉత్పత్తులు పెరిగి రైతులు లాభాల బాట పట్టగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.భూసారం పెరిగి పంటలకు పోషక లవణాలు విస్తారంగా లభించగలవన్నారు. ప్రతి ఏడు ఒకే పంటను సాగు చేయడంవలన తెగుల్ల నివారణకు అధిక మోత్తంలో క్రిమిసంహరక మందులు, ఎరువుల వాడకం పెరిగి రైతులకు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. శుక్రవారం మండలంలోని గుంటపెల్లి చెరువు తండాలో సర్పంచ్ మాలోతు సునితా పుణ్యానాయక్ అధ్యక్షతన గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆదేశాలతో మొక్క జొన్న, ఆయిల్ పామ్ తోటల సాగుపై శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అనేక రకాల సహకారం చేస్తుందని వివరించారు. కోతులు, అఠవీ జంతువుల భారి నుండి పంటల రక్షణకు టార్ఫాలిన్ కాగితాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాక యువి లైట్ పద్దతులు అనుసరించాలని అన్నారు. సమావేశంలో 85 మంది రైతులకు ఉచితంగా విత్తనాల బ్యాగులను పంపిణీ చేశారు. జడ్పీటిసి చీటి లక్ష్మన్ రావు మాట్లాడుతూ గత ఏడాది నుండి ఆయిల్ ఫామ్ తోటల సాగు ప్రారంభించినట్లు తెలిపారు. ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులను ఫీల్డు ట్రిప్పులకు తీసుకెల్లి అవగహన కల్పించినట్లు చెప్పారు.

తప్పని సరి పరిస్థితుల్లో మొక్క జొన్న, ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేయాలని కోరారు. మార్కేట్ సౌకర్యాలు కల్పించుటకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నందున పంట మార్పిడి పద్దతి అమలు చేయాలని అన్నారు .కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ శాస్త్ర వెత్తలు డాక్టర్ పి మధుకర్‌రావు, , డి శ్రావణి , ఏఓ పద్మ , డాక్టర్ కె మధన్ మోహన్ రెడ్డి , మండల వ్యవసాయశాఖాధికారి భూమ్ రెడ్డి , విస్తరణ అధికారులు మసూద్ , ముకుంద్ లక్ష్మన్ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News